తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పంద్రాగస్టుకు స్టైలిష్ స్టార్ సూపర్​ గిఫ్ట్ - harika haasini criations

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర టైటిల్​ను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.

అల్లు

By

Published : Aug 12, 2019, 6:48 PM IST

Updated : Sep 26, 2019, 6:59 PM IST

'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో యువ హీరో సుశాంత్‌, సీనియర్‌ హీరోయిన్‌ టబు, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ విడుదల తేదీ ఖరారు చేసింది చిత్రబృందం.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేస్తామని తెలిపింది చిత్రబృందం.

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కలయికలో వస్తోన్న మూడో చిత్రం అయినందున ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా

ఇవీ చూడండి.. ఇస్మార్ట్​ దర్శకుడితో రౌడీ.. అంతా రెడీ

Last Updated : Sep 26, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details