ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. దీంతో అతడి తదుపరి సినిమాపై అందరి దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్తో తర్వాతి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 2021 వేసవిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్, అల్లు అర్జున్తో మరో చిత్రం చేయబోతున్నాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీతో మూడు చిత్రాలు చేసిన త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడట. కొత్తగా తయారు చేసిన కథలో బన్నీ ప్రధానపాత్రలో నటిస్తున్నాడని సమాచారం.