అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా టీజర్ విడుదల విషయమై సినీ వర్గాల్లో చర్చసాగుతోంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టీజర్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ 8న సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్రబృందం. దీంతో ఈసారి టీజర్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.
అల్లుఅర్జున్ 'పుష్ప' టీజర్.. ఆరోజేనా? - allu arjun pushpa teaser
అల్లుఅర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా టీజర్‌ను.. ఆయన పుట్టిన రోజు(ఏప్రిల్ 8) సందర్భంగా విడుదల చేస్తారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
పుష్ప
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నీ- సుకుమార్ మరోసారి కలిసి చేస్తుండటం వల్ల ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఇదీ చూడండి: 'పుష్ప'లో బన్నీ మేకప్ కోసం అన్ని గంటలా?