తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​కు 'పుష్ప'రాజ్ సిద్ధం.. స్పెషల్ వీడియో పోస్ట్ - #pushpa

'పుష్ప' షూటింగ్ మంగళవారం నుంచి తిరిగి మొదలు కానుందని చిత్రబృందం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

allu-arjun-to-begin-shoot-pushpa-from-10-nov-2020
అల్లు అర్జున్ పుష్ప సినిమా

By

Published : Nov 9, 2020, 10:49 AM IST

'ఆర్య', 'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. రేపటి నుంచి తిరిగి చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ.. చాలా రోజుల నిరీక్షణ తర్వాత మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు.

సాధ్యమైనంత త్వరగానే ప్రేక్షకులను పుష్ప పలకరిస్తాడని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కుదిరితే వచ్చే వేసవికి ఐదు భాషల్లో ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details