తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వచ్చే ఏడాది బన్నీ డబుల్ ధమాకా..! - వేణు శ్రీరామ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే ఏడాది రెండు చిత్రాలతో అలరించనున్నాడు. సంక్రాంతికి త్రివిక్రమ్ సినిమా, వేసవిలో వేణు శ్రీరామ్ 'ఐకాన్'ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

వచ్చే ఏడాది బన్నీ ఢబుల్ ధమాకా..!

By

Published : May 31, 2019, 6:10 AM IST

సంక్రాంతికి సందడి చేస్తా.. వేసవిలో వినోదాల విందు కురిపిస్తా అంటున్నాడు అల్లు అర్జున్‌. అర్థం కాలేదా... వచ్చే ఏడాది బన్నీ బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయబోతున్నాడు.

ప్రస్తుతం స్టైలిష్‌ స్టార్‌.. త్రివిక్రమ్‌తో కలిసి ‘ఏఏ 19’తో సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల 4 నుంచి 30 రోజుల పాటు లాంగ్‌ షెడ్యూల్‌ జరుపుకోనుంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్

ఈ చిత్రంతో పాటే వేణు శ్రీరామ్‌ ‘ఐకాన్‌’ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు బన్నీ. దిల్‌రాజు నిర్మాత. ప్రీ ప్రొడక్షన్‌ పనులను షురూ చేశారు. ఫిబ్రవరికి పూర్తి చేసి, వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

వాస్తవానికి ‘ఏఏ 20’గా సుకుమార్‌ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని భావించినప్పటికీ స్క్రిప్ట్‌ పని ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: గేమ్​ ఓవర్​: తాప్సీ భయానికి కారణం?

ABOUT THE AUTHOR

...view details