ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టిన రోజు గిఫ్ట్ అందింది. బన్నీ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులతో పంచుకుంది.
బన్నీ-సుకుమార్ సినిమా టైటిల్ 'పుష్ప' - Allu Arjun Sukumar New Movie
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా బన్నీ బర్త్‌డే కానుకగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
![బన్నీ-సుకుమార్ సినిమా టైటిల్ 'పుష్ప' అల్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6705889-thumbnail-3x2-all.jpg)
ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గుబురు గడ్డం, ఒత్తు జుట్టుతో తీక్షణంగా చూస్తున్న బన్నీ లుక్ మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు అర్జున్. "ఇది నా తర్వాత చిత్రం ఫస్ట్‌లుక్. టైటిల్ 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నా. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్నీ ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. అందుకు తగినట్లుగానే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, స్టైల్ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం,కన్నడలో తెరకెక్కుతోంది.