తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రౌడీ హీరోకు థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్ - రౌడీ దుస్తుల్లో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ పంపించిన రౌడీ బ్రాండ్ దుస్తులను ధరించి ఫొటోలకు పోజిచ్చాడు. అలాగే ఆ స్టైలిష్ డ్రెస్ పంపినందుకు విజయ్​కు థ్యాంక్స్ చెప్పాడు.

Allu Arjun special thanks to Vijay Devarakonda
రౌడీ హీరోకు థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్

By

Published : Dec 3, 2020, 10:16 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్​లో స్టైలిష్ ఐకాన్స్​గా కొనసాగుతున్నారు. డిఫరెంట్ లుక్స్​తో అదరగొడుతున్నారు. అప్పుడప్పుడూ తన బ్రాండ్ (రౌడీ) దుస్తులను బన్నీకి పంపిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు విజయ్.

ఆ బ్రాండ్ నుంచి విజయ్.. అల్లు అర్జున్​కు గతంలోనే ఒక కలెక్షన్​ను పంపాడు. అలా ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్స్​ను పంపాడు. తాజాగా అవి వేసుకుని స్టైలిష్ లుక్​లో కనిపించి ఇలాంటి స్పెషల్ థింగ్స్ తనకు పంపినందుకు విజయ్​కు, రౌడీ బ్రాండ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు బన్నీ.

ABOUT THE AUTHOR

...view details