ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయిపల్లవి యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నారు. మిలియన్ల కొంది వ్యూస్‌తో ఈ ఇద్దరు తారలు ఎవరికి వారే సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరీ'. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. అతి తక్కువ సమయంలో ఎంతోమందిని ఆకర్షించింది. కాగా, తాజాగా ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'లవ్‌స్టోరీ' విషయానికి వస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరో. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
యూట్యూబ్‌లో సందడి చేస్తున్న బన్నీ, సాయి పల్లవి - సారంగదరియా యూట్యూబ్ వ్యూస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన 'లవ్‌స్టోరీ' చిత్రంలోని 'సారంగదరియా' సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.
బన్నీ, సాయి పల్లవి
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' యూట్యూబ్‌లో వీక్షకులను బాగా ఆకర్షిస్తోంది. బన్నీ-హరీశ్‌శంకర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ 100 మిలియన్ల మంది వీక్షించారు. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బన్నీ-పూజాహెగ్డే జోడీ మొదటిసారి ఈ చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది.