తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Allu arjun: 'పుష్ప' కోసం బన్నీ.. ఈ నెలాఖరు నుంచే - telugu movie news

కరోనా ప్రభావం తగ్గుతుండటం వల్ల షూటింగ్​కు సిద్ధమవుతున్నారు. జూన్ నెలాఖరు నుంచే సెట్​లో హీరోతో పాటు ప్రధాన తారాగణం అడుగుపెట్టనున్నారు.

allu arjun resuming pushpa shoot
అల్లు అర్జున్ పుష్ప

By

Published : Jun 14, 2021, 6:24 AM IST

తగ్గేదే ల్యా.. అనే సంభాషణ తరహాలోనే చిత్రీకరణలోనూ జోరు చూపిస్తోంది 'పుష్ప' బృందం. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడం.. లాక్‌డౌన్‌ సడలింపులు రావడం వల్ల మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ నెలాఖరు నుంచే హైదరాబాద్‌లో చిత్రీకరణ షురూ చేయనున్నారు.

అల్లు అర్జున్ పుష్ప మూవీ

హీరో అల్లు అర్జున్‌, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం దాదాపు తుదిదశకు చేరుకుంది. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details