తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్రహ్మానందం నుంచి బన్నీకి ఊహించని గిఫ్ట్ - brahmanandam pencil sketch

హాస్యనటుడు బ్రహ్మానందం గీసిన అద్భుతమైన పెన్సిల్​ స్కెచ్​ను కథానాయకుడు అల్లు అర్జున్​కు బహుకరించారు. ఈ మేరకు బన్నీ ట్విట్టర్​ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు.

Allu Arjun receives priceless gift from comedian brahmanandam
అల్లు అర్జున్ బ్రహ్మానందం

By

Published : Jan 1, 2021, 2:01 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్​కు ఊహించని బహుమతి వచ్చింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం.. దాదాపు 45 రోజుల పాటు శ్రమించి వేంకటేశ్వర స్వామి పెన్సిల్​ స్కెచ్​ను గీశారు. దానిని బన్నీకి గిఫ్ట్​ ఇవ్వగా, ఆ విషయాన్ని ట్వీట్ చేసిన ఆనందం వ్యక్తం చేశారు. వెలకట్టలేని బహుమతి అంటూ బ్రహ్మీకి ధన్యవాదాలు తెలియజేశారు.

అల్లు అర్జున్ ట్వీట్

ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తూ అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. కొన్నిరోజుల్లో భారీ షెడ్యూల్​ ప్రారంభం కానుంది. రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details