తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' ట్రైలర్​కు​ కౌంట్​డౌన్.. అర్హ వాల్ క్లైంబింగ్ - అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల సంగతులతో పాటు అర్హ వాల్​ క్లైంబింగ్​ గురించి కూడా ఉంది.

allu arjun allu arha
అల్లు అర్జున్ అర్హ

By

Published : Dec 5, 2021, 12:42 PM IST

Updated : Dec 5, 2021, 1:41 PM IST

Pushpa trailer: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా ట్రైలర్​ విడుదలకు మరో రోజు మాత్రమే ఉంది. సోమవారం ఉదయం దీనిని రిలీజ్ చేయనున్నారు. దీని కోసం ఫ్యాన్స్​ తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​ టీజ్.. చిత్రంపై అంచనాలు తెగ పెంచేస్తోంది. టీజ్ ఇలా ఉందంటే ఇక ట్రైలర్​ ఏ రేంజ్​లో ఉండబోతుందో అని ఊహాగానాలు పెంచేసుకుంటున్నారు.

శేషాచలం అడవుల నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ్, స్మగ్లర్​, డాన్​గా కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించింది. డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురానున్నారు.

Raviteja new movie: మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. సోమవారం ఉదయం 10:08 గంటలకు 'ఇష్యూయింగ్ ఆర్డర్స్' రానున్నాయని ఓ ఫొటో పోస్ట్ చేశారు. అయితే ఇది టీజర్​ గురించి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ

ఇందులో రవితేజ.. తహసీల్దార్ పాత్రలో కనిపించనున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్​గా చేస్తోంది. వేణు, రజిష విజయన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో శరత్​ మాండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

Allu arha: అల్లు అర్జున్ కుమార్తె అర్హ.. ఎంత చురుకైన చిన్నారి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలనటిగా ఇప్పటికే సమంత 'శాకుంతలం' నటించింది. ఇటీవల నోబుల్​ బుక్ అవార్డును కూడా అందుకుంది. అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచిన అర్హ.. దీనిని సాధించింది.

ఇప్పుడు వాల్ క్లైంబింగ్​లో సత్తా చాటుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ సతీమణి అల్లు స్నేహ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై సమంత, ఇషా అగర్వాల్ లైక్ చేసి, తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

భీమ్లా నాయక్ మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 5, 2021, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details