తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోరాట సన్నివేశాలతో 'పుష్ప' షూటింగ్​ షురూ! - అల్లు అర్జున్​ తాజా సినిమా వార్తలు

అల్లు అర్జున్​ హీరోగా నటిస్తున్న 'పుష్ప' షూటింగ్.. తిరిగి​ నవంబరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలుత పోరాట ఘట్టాలతోనే చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

allu arjun pushpa
పుష్ప

By

Published : Oct 1, 2020, 8:00 AM IST

'పుష్ప'రాజ్‌ రంగంలోకి దిగే సమయం వచ్చింది. అడవుల్లో అతని పోరాటం షురూ కాబోతోంది. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో ఎర్రచందనం దుంగల స్మగ్లర్​గా అల్లు అర్జున్​ కనిపించనున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మొదట పోరాట ఘట్టాలతోనే షూటింగ్​ షురూ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం హైదరాబాద్‌లో రిహార్సల్స్‌ కూడా ఆరంభించారు. అడవుల్లో సాగే ఫైట్​ సీన్స్​పై దర్శకుడు సుకుమార్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.

కేరళలో కానీ, మారేడుమిల్లి అడవుల్లో కానీ షూటింగ్​ జరగనుంది. 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాల తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details