తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Allu arjun Pushpa: లీకుల బెడద.. 'పుష్ప' షూటింగ్​కు భద్రత - అల్లు అర్జున్ పుష్ప లేటెస్ట్​ న్యూస్

బన్నీ 'పుష్ప' షూటింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతోంది. ఇటీవల చిత్ర వీడియోలు లీక్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Allu arjun Pushpa
అల్లు అర్జున్ పుష్ప

By

Published : Aug 23, 2021, 7:36 AM IST

Updated : Aug 23, 2021, 11:44 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప'(allu arjun pushpa) మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇటీవల సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడం(pushpa leak song) వల్ల.. చిత్రబృందం పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో సెట్​లో మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది.

అల్లు అర్జున్ పుష్ప

బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రతినాయకుడు ఫహాద్‌ ఫాజిల్‌(pushpa fahad) రంగంలోకి దిగారు. ఈయనపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. ఇటీవలే విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' పాటకు లభిస్తున్న స్పందనపై చిత్రబృందంపై సంతృప్తి వ్యక్తం చేసింది.

ఫహాద్ ఫాజిల్

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details