సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన అప్టేట్ను ఏప్రిల్ 3న ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.
'పుష్ప' నుంచి సర్ప్రైజ్ వచ్చేస్తుందోచ్
అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాకు సంబంధించి అప్డేట్ను ఏప్రిల్ 3న ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రిమూవీ మేకర్స్. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా.. హీరోయిగా రష్మిక నటించింది. ఆగస్టు 13న విడుదల కానుందీ సినిమా.
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఇందులో విలన్గా కనిపించనున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నీ- సుకుమార్ మరోసారి కలిసి చేస్తుండటం వల్ల ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఇదీ చూడండి: 'పుష్ప'లో బన్నీ మేకప్ కోసం అన్ని గంటలా?