తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa News: అల్లు అర్జున్ 'పుష్ప' కొత్త అప్డేట్ - పుష్ప సినిమా న్యూస్

అల్లుఅర్జున్ 'పుష్ప'(pushpa latest updates)రెండో పాటకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే దాని విడుదల తేదీని ప్రకటిస్తామని ట్వీట్​ చేసింది.

Pushpa movie
పుష్ప సినిమా

By

Published : Sep 27, 2021, 12:15 PM IST

అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప'(Pushpa News)నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని రెండోపాట విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ట్వీట్ చేసింది. చిత్రీకరణ జరుగుతున్న లొకేషన్​ ఫోటోనూ పోస్ట్ చేసింది.

పుష్ప(Pushpa Latest Updates) మొదటి పాట 'దాక్కో దాక్కో మేక'ను ఆగస్టు 13న విడుదల చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డు స్థాయిలో 52 మిలియన్​ వ్యూస్​తో దూసుకెళ్తోంది. అంతకుముందు రిలీజైన 'పుష్ప'(Pushpa News) టీజర్ కూడా సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుని.. సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్​.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ముత్తంశెట్టి మీడియాతో కలిసి నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు(Pushpa Release Date) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details