అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పుష్ప' ఒకటి. డిసెంబరు 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా.. ఈ చిత్రాన్ని వీక్షించిన యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.
ఈ ఏడాదిలో ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని సంధు అభిప్రాయపడ్డారు. బన్నీ నటన అదిరిపోయిందని కితాబిచ్చారు. హీరోయిన్ రష్మిక కూడా బాగా నటించిందని, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా ఉందని అన్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.