తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​లో లీకుల గోల.. ఎక్కడ తప్పు జరుగుతోంది? - pushpa movie fight scene

'పుష్ప', 'సర్కారు వారి పాట', 'భీమ్లా నాయక్' చిత్రాలకు లీకుల బెడద తప్పలేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ సైబర్ క్రైమ్​ను ఆశ్రయించారు. అయితే లీకుల విషయంలో తప్పు జరగకుండా నిర్మాణ సంస్థలు ముందే దృష్టి సారించాల్సి ఉంది.

pushpa
పుష్ప

By

Published : Aug 16, 2021, 5:30 AM IST

తెలుగు స్టార్ హీరోల సినిమాలకు లీకుల బాధ తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన టీజర్లు, లిరికల్ సాంగ్స్​ చెప్పిన తేదీ కంటే ముందు లీకు వీరులు సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇప్పుడు అల్లు అర్జున్​ 'పుష్ప'లోని రెండు నిమిషాల ఫైట్​ సీన్​ కూడా లీకైందంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది.


"ఈ మధ్య కాలంలో 'పుష్ప' 'దాక్కో దాక్కో మేక' సాంగ్, 'సర్కారు వారి పాట' బ్లాస్టర్​ లీక్ కావడం మమ్మల్మి కలచివేసింది. ఈ విషయంలో తమను ఇబ్బంది పెట్టడమే కాకుండా అభిమానుల ఆసక్తిని కూడా కొందరు చంపేస్తున్నారు. దీనిని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. లీకు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. సైబర్ క్రైమ్ డిపార్ట్​మెంట్​లో ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశాం. ప్రియమైన అభిమానులారా.. పైరసీని ప్రోత్సహించొద్దు. ఒకవేళ ఎవరైనా పైరసీ, లీక్ చేయాలని చూస్తే శిక్ష అనుభవించక తప్పదు"

-మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాణ సంస్థ


పైన చెప్పిన సినిమాలే కాకుండా పవన్​ 'భీమ్లా నాయక్' టీజర్​ కూడా చెప్పిన దాని కంటే ముందు రోజు రాత్రే లీకు చేశారు. ఈ విషయంలో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే గానీ దీనిని నియంత్రించడం సాధ్యం కాదు.

ఇదీ చదవండి:ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్​సిరీస్​లు చూసేయండి

ABOUT THE AUTHOR

...view details