తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' క్రేజీ అప్​డేట్.. 'అద్భుతం' ట్రైలర్​ ఆహా! - kamal haasan

కొత్త సినీ కబుర్లు వచ్చేశాయి. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప'తో (Pushpa Movie) పాటు యువ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రానికి సంబంధించిన అప్​డేట్లు ఉన్నాయి.

pushpa movie
rashmika mandanna

By

Published : Nov 9, 2021, 8:13 PM IST

Updated : Nov 9, 2021, 9:30 PM IST

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ (Allu Arjun New Movie) నటిస్తున్న 'పుష్ప' నుంచి మరో అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. బుల్లితెర స్టార్​, యాంకర్​ అనసూయ పాత్రను బుధవారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో 'ద్రాక్షాయిని'గా కనిపించనుంది అనసూయ.

'పుష్ప'

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(Sukumar Alluarjun Movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(Alluarjun Rashmika Movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు.

'పుష్ప'లో ద్రాక్షాయినిగా అనసూయ

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని (Pushpa Release Date) డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అనసూయ
  • యువ నటుడు తేజా సజ్జా నటిస్తున్న నూతన చిత్రం 'అద్భుతం' (Adbhutam Teja Sajja). శివానీ రాజశేఖర్ హీరోయిన్​గా నటిస్తోంది. చిత్ర ట్రైలర్​ మంగళవారం విడుదలైంది. ఒకే ఫోన్​ నెంబర్​ ఇద్దరికి ఇస్తే ఏం జరగుతుందనే ఆసక్తికర అంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించారు. మల్లిక్ రామ్​ దర్శకుడు. రధన్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా నవంబర్​ 19 నుంచి డిస్నీప్లస్​ హాట్​స్టార్​లో ప్రసారం కానుంది.
  • 'రెమో'తో తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్​ నటిస్తున్న కొత్త చిత్రం 'డాన్' (Sivakarthikeyan Don Movie)​. సిబి చక్రవర్తి దర్శకుడు. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను బుధవారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు.
    'డాన్​'గా శివ కార్తికేయన్
  • లోకనాయకుడు కమల్​ హాసన్​ (Kamal Haasan Latest Movies) మరో యువ దర్శకుడితో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 'కబాలి', 'కాలా', 'సార్పాట్టా' చిత్రాలను తెరకెక్కించిన పా రంజిత్​ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కమల్​ హాసన్​ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నారు.
    'విక్రమ్​'లో కమల్ హాసన్

ఇదీ చూడండి:హృతిక్ రోషన్​​ నా చిత్రంలో నటిస్తారేమో: నాని

Last Updated : Nov 9, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details