అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ ‘ఎవరు’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఆదివారం రాత్రి ఈ సినిమాను వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
"ఎవరు' చిత్ర బృందానికి అభినందనలు. నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఊహించని మలుపులు, ట్విస్టులతో సాగిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ ఆకట్టుకుంది. సినిమాలోని కథ, సాంకేతికత అలరించింది. రెజీనా, అడివి శేష్ చాలా బాగా నటించారు.' -ట్విట్టర్లో అల్లు అర్జున్