నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ దర్శకత్వం వహించారు. మహా శివరాత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
'జాతిరత్నాలు' బృందానికి స్టైలిష్ స్టార్ ప్రశంసలు - అల్లు అర్జున్ రాహుల్ రామకృష్ణ
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జాతిరత్నాలు'. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ చూసిన అల్లు అర్జున్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.
"గత రాత్రి 'జాతిరత్నాలు' సినిమా చూశా. చిత్రబృందానికి అభినందనలు. కామెడీ మూవీ. కొంతకాలంగా ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు. అద్భుత నటనతో నవీన్ పొలిశెట్టి అదరగొట్టాడు. రాహుల్ రామకృష్ణ బ్రిలియెంట్. ప్రియదర్శి, ఫరియాతో పాటు మిగతా ఆర్టిస్టులు బాగా నటించారు. సాంకేతిక నిపుణులు, మ్యూజిక్ డైరెక్టర్ రధన్కు అభినందనలు. నిర్మాతలు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, దత్, స్వప్న సినిమా నిర్మాణ సంస్థకు నా ప్రేమను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసిన దర్శకుడు అనుదీప్‌కు నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు బన్నీ.