కమెడియన్ సుహాస్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కలర్ ఫొటో'. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. పలువురు సినీ తారలు కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు.
"కలర్ ఫొటో చిత్రబృందానికి అభినందనలు. తియ్యని ప్రేమకథతో చాలా బాగా తీశారు. సంగీతంతో పాటు భావోద్వేగాలు, నటీనటుల ప్రదర్శన చాలా బాగుంది. చాలా కాలం తర్వాత మంచి సినిమా చూడటం ఆనందంగా ఉంది."