శుక్రవారం విడుదలైన జెర్సీ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కితాబిచ్చాడు.
"గౌతమ్ తిన్ననూరి.. సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. హీరోగా నాని అదరగొట్టేశాడు. చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు" -అల్లు అర్జున్, టాలీవుడ్ హీరో