తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూడేళ్లకే పెళ్లి విషయంలో బన్నీకి అర్హా షాక్ - అర్హతో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెట్టింట ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో తనయ అర్హాతో కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Allu Arjun posts adorable video with daughter Arha
బన్నీఅర్హ

By

Published : Jun 12, 2020, 3:58 PM IST

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్​ కూతురు అర్హాకు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో ఆ చిన్నారితో తాను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని బన్నీ అడగ్గా.. చేసుకోను అంటూ క్యూట్​గా చెప్పింది అర్హా. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అర్జున్​.. ఇది 374వ ప్రయత్నమని క్యాప్షన్ ఇచ్చారు.

లాక్​డౌన్ సమయాన్ని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబంతో గడపడానికి వెచ్చిస్తిస్తున్నారు అర్జున్. తనయుడు అయాన్, తనయ అర్హాతో కాలక్షేపం చేస్తున్నారు. తరచూ వీరి వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్​లో ఉంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప'లో నటిస్తున్నారు బన్నీ. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details