ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా విశేషంగా అలరిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. వసూళ్ల పరంగా కొన్ని ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులను సృష్టించిందని, చిత్ర నిర్మాణ సంస్థ ఇంతకు ముందే ప్రకటించింది. యూఎస్‌లోని కలెక్షన్లలో బాహుబలి తర్వాత స్థానాల్లో నిలిచిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్రబృందం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్.
సిత్తరాల సిరపడు మరోసారి అలరించబోతున్నాడా? - ala vaikunta puram lo news
అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ఈ సంక్రాంతికి విడుదలై, ఘనవిజయం సాధించింది. వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని ప్రచారం సాగుతోంది.
సిత్తరాల సిరపడు.. మరోసారి క్యారెక్టర్ ఎక్కబోతున్నాడా..?
'అల వైకుంఠపురములో' చిత్రీకరణ జరుగుతున్నప్పుడే త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకున్నాడట. ఇప్పుడీ చిత్రం ఇచ్చిన విజయంతో, దీనికే కొనసాగింపు తీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. బన్నీ అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ సీక్వెల్ గురించి వస్తున్న వార్తల్లో నిజం తెలియాలంటే అధికార ప్రకటన కోసం వేచిచూడాల్సిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి.. ఫైర్ బ్రాండ్.. కబడ్డీ కోచ్‌గా మారితే..!
Last Updated : Feb 29, 2020, 3:39 PM IST