Allu arju Pushpa movie: 'సినిమా గెలవాలి.. ప్రపంచ సినిమా గెలవాలి' అని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అన్నారు. 'పుష్ప' ప్రచారంలో గురువారం ముంబయిలోని ప్రెస్మీట్లో పాల్గొన్న బన్నీ.. 'స్పైడర్‌మ్యాన్' సినిమాతో పోటీ గురించి కూడా మాట్లాడారు. అయితే థియేటర్లకు జనాలు మళ్లీ ఎక్కువగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
"గత కొన్నాళ్ల నుంచి థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. ఈ సందర్భంగా నేను 'పుష్ప' గురించో మరో సినిమా గురించి ఆలోచించడం లేదు. భారతీయ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. మన సినిమానే కాకుండా ప్రపంచ సినిమా గెలవాలి. జనాలు మళ్లీ అధిక సంఖ్యలో థియేటర్లకు రావాలి" అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అల్లు అర్జున్ సమాధానమిచ్చారు.
Pushpa vs Spider man: తాను హీరోగా నటించిన 'పుష్ప'తో పాటు 'స్పైడర్‌మ్యాన్', తర్వాతి వారం రాబోయే '83' సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.