అభిమానులకు శుభవార్త వినిపించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. చాలా రోజులుగా కొరటాల శివతో బన్నీ సినిమా అంటూ వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పెడుతూ అధికారికంగా చిత్రాన్ని ప్రకటించింది చిత్రబృందం. యువసుధ ఆర్ట్స్, జీఏ2 బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవనుంది. 2022 ప్రారంభంలో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.
బన్నీ-కొరటాల సినిమా ప్రకటన వచ్చేసింది - అల్లు అర్జున్ కొత్త చిత్రం
కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్ ఓ చిత్రం చేస్తున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై బన్నీ యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. కొరటాలతో బన్నీ సినిమా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అల్లు అర్జున్-కొరటాల సినిమా ప్రకటన వచ్చేసింది
ఇప్పటికే అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే చిత్రానికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు కొరటాల సినిమాతో ఈ చిత్రంపై అనుమానాలు నెలకొన్నాయి. 'ఐకాన్'.. బన్నీ 21వ చిత్రంగా తెరకెక్కాల్సి ఉంది. ఇప్పుడు మరి కొరటాలతో చిత్రం తర్వాత అయినా ఈ సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.
Last Updated : Jul 31, 2020, 1:27 PM IST