తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుకుమార్ సినిమా కోసం బన్నీ మాస్ లుక్! - entertainment news

దర్శకుడు సుకుమార్​తో చేస్తున్న సినిమాలో సరికొత్త లుక్​తో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం అందుకోసమే గడ్డం పెంచుతున్నాడు.

సుకుమార్ సినిమా కోసం బన్నీ మాస్ లుక్
హీరో అల్లు అర్జున్

By

Published : Feb 9, 2020, 5:46 PM IST

Updated : Feb 29, 2020, 6:48 PM IST

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్.. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిట్​ను ఆస్వాదిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీని తర్వాత సుకుమార్​ సినిమాలో నటించనున్నాడు బన్నీ. ఇందుకోసం సరికొత్త లుక్​లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

గడ్డం పెంచుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ.. లారీ డ్రైవర్​గా కనిపించనున్నాడట. ఈ పాత్రలో మాస్​గా కనిపించేందుకు ప్రస్తుతం గడ్డం పెంచే పనిలో ఉన్నాడీ హీరో. త్వరలో ఇతడికి సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది. ఇందులో రష్మిక హీరోయిన్​. విజయ్ సేతుపతి విలన్​గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Last Updated : Feb 29, 2020, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details