విజయవాడలోని స్వగృహంలో ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ అర్జున్ తల్లి నిర్మలా దేవికి సోదరుడు. ప్రస్తుతం నిర్మాతగానూ మారారు. బన్నీతో సుకుమార్ తెరకెక్కిస్తున్న 'ఏఏ 20' సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు.
అల్లు అర్జున్ ఇంట విషాదం.. 'ఏఏ20' నిర్మాత మృతి - అల్లుఅర్జున్ ఏఏ20
'అల వైకుంఠపురములో' విజయోత్సాహంలో ఉన్న అల్లు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అకాల మరణం వారింట తీరని లోటు మిగిల్చింది.
అల్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నిర్మాణ బాధ్యతలు అందుకున్నారు. ఇటీవలే చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవక ముందే ఆయన హఠాన్మరణం చెందడం అందరినీ కలచివేసింది.
ఇదీ చదవండి: అభిమాని ప్రశ్నకు షారుఖ్ అదిరిపోయే సమాధానం
Last Updated : Feb 18, 2020, 2:44 AM IST