తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుట్టినరోజున స్టైలిష్​ స్టార్​ ట్రిపుల్​ ధమాకా - సుకుమార్

ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ప్రస్తుతం ప్రకటించిన రెండు సినిమాలతో పాటు దిల్​రాజ్ నిర్మాణంలో మరో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఒకేసారి మూడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైన అల్లు అర్జున్

By

Published : Apr 8, 2019, 8:32 AM IST

తమ అభిమాన హీరో తర్వాతి సినిమా ఏంటా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అల్లు అర్జున్ ట్రిపుల్ ధమాకా ఇచ్చాడు. ఒకేసారి మూడు సినిమాల్ని లైన్​లో పెట్టేశాడు. త్రివిక్రమ్, సుకుమార్​తో ఇప్పటికే సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా వేణు శ్రీరామ్​ తెరకెక్కించే చిత్రంలోనూ హీరోగా నటించనున్నాడు.

2018లో వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత మరో సినిమా చేయలేదు అల్లు అర్జున్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పుడు మూడోసారి నటించనున్నాడీ మెగాహీరో. ఇంతకు ముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు వచ్చే కొత్త సినిమా తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉండనుందని సమాచారం.

త్రివిక్రమ్​తో తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో రానున్న సినిమా

స్టైలిష్ డైరక్టర్ సుకుమార్​ దర్శకత్వంలోనూ మూడోసారి నటించనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఆర్య, ఆర్య-2 లతో మెప్పించారు. ఇప్పుడు అలాంటి కథతోనే సినిమా చేస్తారా లేదా వేరే జానర్​లో చేస్తారా చూడాలి.

సుకుమార్​తో అల్లు అర్జున్​తో మళ్లీ ప్రేమకథనే తెరకెక్కిస్తాడా..?

ఈ ఇద్దరు కాకుండా వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడీ అల్లువారి అబ్బాయి. దిల్​రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఐకాన్ కనబడుటలేదు' అనే వినూత్న టైటిల్​ నిర్ణయించారు.

వినూత్న టైటిల్​తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా

మరి ఈ మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయా లేదా అని చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details