టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మరో ఘతన సాధించారు. మెన్ లైఫ్‌స్టైల్ మీడియా బ్రాండ్ జీక్యూ ప్రకటించిన 25 మంది అత్యంత ప్రభావిత యంగ్ డైనమిక్స్ జాబితాలో స్థానం సంపాదించారు. సినీ రంగానికి చెందినవారిలో అనుష్క శర్మ కూడా చోటు దక్కించుకుంది. క్రికెటర్లలో కేఎల్ రాహుల్, పంత్ ఉన్నారు.
గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో ఈ 25 మంది వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే వారికి జీక్యూ సంస్థ తమ జాబితాలో చోటు కల్పించింది.
గతేడాది 'అల వైకుంఠపురములో'లోని 'బుట్టబొమ్మ' పాటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని అలరించారు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ 'పుష్ప' చిత్రం చేస్తున్నారు.
జీక్యూ టాప్ 25 యంగ్ డైనమిక్స్
1. జెహన్ దరువల
2. అభిషేక్ ముంజల్
3. డా. నందినీ వెల్‌హో
4. బైజు రవీంద్రన్
5. అనుష్క శర్మ మరియు కర్నేష్ శర్మ
6. ప్రణవ్ పై మరియు సిద్ధార్థ్ పై
7. తరుణ్ మోహతా మరియు స్వప్నిల్ మెహతా
8. లీజా మంగళ్‌దాస్
9. డానిష్ సైత్
10. బాల సర్దా