తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్ కొత్త థియేటర్ 'AAA సినిమాస్' - అల్లు అర్జున్ న్యూస్

ఐకాన్ స్టార్ 'AAA సినిమాస్' థియేటర్​కు శనివారం పూజా కార్యక్రమం జరిగింది. సరికొత్త టెక్నాలజీతో ఇది ప్రేక్షకుల్ని అలరించనుంది.

Allu Arjun launch 'AAA Cinemas' In hyderabad
అల్లు అర్జున్ కొత్త థియేటర్ 'AAA సినిమాస్'

By

Published : Nov 6, 2021, 3:20 PM IST

నటనే కాదు, వ్యాపార రంగంలోనూ తమదైన ముద్రవేయాలని తెలుగు సినీ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల విజయ్‌ దేవరకొండ మూవీ థియేటర్స్‌ను ప్రారంభించగా, త్వరలో అల్లు అర్జున్‌ కూడా అదే బాటలో పయనించనున్నారు. 'AAA' సినిమాస్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్న థియేటర్‌కు శనివారం బన్నీ పూజా కార్యక్రమం నిర్వహించారు.

అల్లు అర్జున్

నిర్మాత సునీల్‌ నారంగ్‌, నారాయణ దాస్‌లు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్‌లోని అమీర్​పేట్​లో ఈ థియేటర్‌ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం అల్లుఅర్జున్‌ 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details