అల్లు అర్జున్ - కొరటాల శివ కలయికలో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. కొరటాల దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఇదివరకే ఓ దఫా చర్చలు జరిగినట్టు సమాచారం. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప' కోసం త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు. తదుపరి కొరటాల దర్శకత్వంలోనే ఆయన సినిమా చేయబోతున్నారని, దీని కోసమే కథ సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
బ్లాక్బస్టర్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా! - chiranjeevi acharya
చిరుతో 'ఆచార్య'ను తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల.. కథానాయకుడు అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేశారట.
హీరో అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చేస్తున్నారు కొరటాల. కరోనా ప్రభావంతో విరామం వచ్చింది. ఈ సమయంలో కొరటాల శివ తదుపరి సినిమాల కోసం కథలు సిద్ధం చేయడంపైనే దృష్టిపెట్టారు. 'ఆచార్య' తర్వాత విరామం లేకుండా, వేగంగా సినిమాలు చేయాలని నిర్ణయించారు.