కరోనా వల్ల ప్రస్తుతం ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవడంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ రూ.కోటి 25 లక్షలు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలతో పాటు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. బన్నీని ప్రశంసించారు.
అల్లు అర్జున్‌పై కేరళ ముఖ్యమంత్రి ప్రశంసలు - కరోనా వార్తలు
హీరో అల్లు అర్జున్ చేసిన ఆర్థిక సాయాన్ని ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తమ రాష్ట్ర ప్రజలు, ఎప్పటికీ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని అన్నారు.
అల్లు అర్జున్ పినరయి విజయన్
"తెలుగు రాష్ట్రాలతో పాటు తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న అల్లు అర్జున్ ఆలోచన గొప్పది. అతడు చేసిన సాయాన్ని కేరళ ప్రజలు మర్చిపోరు. తప్పకుండా రుణపడి ఉంటారు" -పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
ఈ కథానాయకుడు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అక్కడ అతడిని అభిమానులు ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. బన్నీ నటించిన సినిమాలు.. అక్కడ విడుదలై అలరిస్తుంటాయి.
Last Updated : Apr 10, 2020, 8:26 PM IST