జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని కలవాలని, ఫొటో తీసుకోవాలని, కనీసం ఆటోగ్రాఫ్ అయినా సంపాదించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభిమానుల కలలను నెరవేర్చేందుకు అప్పుడప్పుడు మన హీరోలే సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. అల్లు అర్జున్ కూడా అలానే ఓ చిన్నారి అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
చిన్నారి కలను నిజం చేసిన అల్లు అర్జున్ - Allu Arjun Christmas
అల్లు అర్జున్ శాంటాలా మారారు. చిన్నారి అభిమాని కలను నెరవేర్చారు. ఇంతకీ బన్నీ ఏమిచ్చి ఆ అబ్బాయిని సర్‌ప్రైజ్ చేశారు?
చిన్నారి కలను నిజం చేసిన అల్లు అర్జున్
ఎప్పటికైనా బన్నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నది ఓ బాలుడి కోరిక. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. తాను సంతకం చేసిన ఓ కాగితాన్ని తన కుమారుడు అయాన్‌కు ఇచ్చి అనాథాశ్రమానికి పంపారు. క్రిస్మస్ సందర్భంగా అయాన్ ఆ బాలుడికి బన్నీ ఆటోగ్రాఫ్ అందజేసి సర్‌ప్రైజ్ చేశాడు. అనాథాశ్రమంలోని మిగిలిన చిన్నారులకు పలు గిఫ్ట్‌లు ఇచ్చి, ఆనందపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.