తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనతో మనమే పోటీ పడాలి: అల్లు అర్జున్ - allu arjun vijay devarakonda

ప్రతివారిలోనూ తమదైన ప్రత్యేకత ఉంటుందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun new movie) అన్నారు. 'పుష్పక విమానం' ట్రైలర్​(pushpaka vimanam 2021 trailer) లాంచ్ ఈవెంట్​కు వచ్చిన ఆయన.. చిత్రబృందానికి విషెస్ చెప్పారు.

allu arjun in pushpaka vimanam trailer launch
అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ

By

Published : Oct 31, 2021, 6:46 AM IST

"పక్కనున్నవాళ్లను చూసి పరిగెత్తడం కాదు. ముందు చూపుతో.. మనతో మనమే పోటీ పడుతూ పరిగెత్తాలి. ప్రతి ఒక్కరిలోనూ వారిదైన ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకరితో మనం పోల్చుకోకుండా మన ప్రత్యేకతను నమ్ముకుని అడుగులు వేయాలి" అని అల్లు అర్జున్(allu arjun movies) అన్నారు. ఆయన ముఖ్య అతిథిగా శనివారం హైదరాబాద్‌లో 'పుష్పకవిమానం' ట్రైలర్‌(pushpaka vimanam 2021 trailer) విడుదల కార్యక్రమం జరిగింది.

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. గీత్‌ సైని, శాన్వి మేఘన కథానాయికలు. గోవర్ధనరావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలు. కథానాయకుడు విజయ్‌ దేవరకొండ(vijay devarakonda movies) సమర్పకులు. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్పక విమానం ట్రైలర్​ లాంచ్ ఈవెంట్​లో అల్లు అర్జున్

"నాకు ట్రైలర్‌ చాలా బాగా నచ్చింది. నా సొంత సినిమా అయినా, నాకు దగ్గరైనవాళ్ల సినిమా అయినా నచ్చకపోతే దాని గురించి పెద్దగా మాట్లాడను. ఈ బృందానికి ముందస్తుగా అభినందనలు చెబుతున్నా. గీత్‌ సైని తెలుగమ్మాయి. తెలుగమ్మాయిలు వచ్చి సినిమాలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేఘన టైమింగ్‌ చాలా బాగుంది. ఆనంద్‌ దేవరకొండకు మంచి సంగీతాభిరుచి ఉందని తెలిసింది. అందుకే తన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ఈ 'పుష్పకవిమానం'(pushpaka vimanam 2021 release date) కచ్చితంగా ఎగురుతుంది" అని బన్నీ చెప్పారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని, నివాళి అర్పించారు.

"నా నిర్మాణ సంస్థలో రెండో సినిమా ఇది. నా దగ్గర కొంచెం శక్తి ఉంటే, అప్పుడు ఇలా మంచి స్క్రిప్ట్‌ దొరికితే దాని వెనక ఉండాలనుకున్నా. ఆ ఆలోచనతోనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశా. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చేసినప్పట్నుంచి నాకు ఈ చిత్ర దర్శకుడు దామోదర్‌ పరిచయం. సునీల్‌ అన్న ఎంతో బలాన్ని తీసుకొచ్చాడు చిత్రానికి. నటన, ఆలోచనల పరంగా అల్లు అర్జున్‌ నాకు స్ఫూర్తినిస్తుంటారు. ఆయన 'పుష్ప'(pushpa naa songs) ప్రచార చిత్రాలు చూసినప్పుడు మరింత కష్టపడదాం అనిపిస్తుంటుంది. పునీత్‌ అన్న దూరం కావడం చాలా బాధగా అనిపించింది. మనమందరం పోతాం. ఉన్నంతవరకు సంతోషంగా ఉందాం, పనిచేద్దాం, ప్రేమిద్దాం, ఒకరినొకరికి అండగా నిలవండి" అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details