తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఐకాన్' గా మారనున్న అల్లు అర్జున్ - రాశీ ఖన్నా

అల్లు అర్జున్ హీరోగా ఈ ఏడాది మరో చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా  షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే 'ఐకాన్' చిత్రం లో నటించనున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్ గా కనిపించనుందని వార్తలు  వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్

By

Published : Jul 10, 2019, 6:01 PM IST

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'ఐకాన్'లో అల్లు అర్జున్ నటించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశీ ఖన్నా నటింనుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మెుదటి సినిమా.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. బన్ని తో దిల్ రాజు ఇప్పటికే 'ఆర్య', 'పరుగు', 'డీజే' చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం బన్ని, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక.. 'ఐకాన్' సినిమా ప్రారంభించనున్నారు.
ఇంతకు ముందు వేణు శ్రీరామ్ ఎమ్ సిఏ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: సన్నీ లియోనీ నయా వ్యాపారం షురూ

ABOUT THE AUTHOR

...view details