ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. తాజాగా 15 రోజుల అనంతరం తనకు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. తను కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత తన తనయుడు అయాన్, కూతురు అర్హాను హత్తుకుని భావోద్వేగం చెందారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కోలుకున్న బన్నీ.. అయాన్, అర్హాతో సరదాగా! - అల్లు అర్జున్ కరోనా నెగిటివ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
"అందరికీ హాయ్.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన నా శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. ఈ లాక్డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశిద్దాం. ఇంట్లో ఉండండి, ఆరోగ్యంగా ఉండి. ప్రేమతో అల్లు అర్జున్" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు బన్నీ.
బన్నీ ప్రస్తుతం 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలకానుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.