తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చెర్రీ బాటలో బన్నీ - sukumar

మెగా పవర్ స్టార్ రాంచరణ్​ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనుసరిస్తున్నాడా..? సుకుమార్​తో సినిమాకు మహేశ్​ బాబు నో చెప్పిన రోజే... బన్నీ అదే డైరెక్టర్​తో సినిమా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. మరి దీనంతటి వెనుక రహస్యమేంటి..?

రాంచరణ్ బాటలో అల్లుఅర్జున్

By

Published : Mar 13, 2019, 5:00 AM IST

Updated : Mar 13, 2019, 7:32 AM IST

సుకుమార్- అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారని తెలియగానే ప్రేక్షకులు ఆశలు పెంచేసుకున్నారు. ఆర్య లాంటి జోష్ రిపీట్​ అవుతోందని సంబరపడ్డారు బన్నీ అభిమానులు. కానీ అదే సమయంలో ఈ ట్రెండీ డైరెక్టర్​తో సినిమా చేయట్లేదంటూ మహేశ్ ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది.

ఆ రోజు ఏం జరిగింది..

రాంచరణ్ అనుసరిస్తూ బన్నీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు. ఎందుకంటే మగధీర లాంటి బ్లాక్​బస్టర్​ సినిమా తర్వాత చరణ్ చేసిన సినిమాలు పెద్దగా అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. ఆ సమయంలోనే సుక్కుతో రంగస్థలం చేశాడు రాంచరణ్. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో నటనతో చెర్రీకి టాలీవుడ్​లో ప్రశంసలు వెల్లువెత్తాయి.

అల్లుఅర్జున్​ ప్రస్తుతం మంచి సినిమాతో హిట్​ కొట్టాలని చూస్తున్నాడు. ఇంకేముంది రాంచరణ్​కు హిట్​ ఇచ్చిన దర్శకుడు, తనకు సినిమాలతో గుర్తింపునిచ్చింది సుకుమార్​ అని భావించాడు బన్నీ. అందుకే ఈ డైరెక్టర్​తోనే తర్వాతి చిత్రం చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన ప్రిన్స్... సుకుమార్​తో​ సినిమా చేయట్లేదని ట్వీట్ చేశాడు. అనుకోని పరిస్థితుల్లో చిత్రం పట్టాలెక్కట్లేదని చెప్పాడు. అంతేకాదు సుకుమార్- బన్నీలకు శుభాకాంక్షలు తెలిపి ఊహాగానాలకు తెరదించాడు.

Last Updated : Mar 13, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details