తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్ మరో రికార్డు.. తొలి దక్షిణాది నటుడిగా! - అల్లు అర్జున్ పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డు నెలకొల్పారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు.

Allu Arjun
అల్లు అర్జున్

By

Published : Aug 30, 2021, 9:39 PM IST

స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి అభిమానులతో 'స్టైలిష్‌ స్టార్‌' అనిపించుకున్న నటుడు అల్లు అర్జున్‌. తన నటన, డ్యాన్స్‌తో యూత్‌ను మెస్మరైజ్‌ చేసి, ఇప్పుడు 'ఐకాన్‌ స్టార్' అయిపోయారు. ఇక సోషల్‌మీడియాలో ఆయనకు ఉండే ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేరళలోనూ అక్కడి అగ్ర కథానాయకులకు సమానంగా అల్లు అర్జున్‌కు క్రేజ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బన్నీ మరో అరుదైన రికార్డు సాధించారు.

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత 12.9 మిలియన్‌ ఫాలోవర్స్‌తో విజయ్‌ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నారు.

అల్లు అర్జున్

ప్రస్తుతం బన్నీ 'పుష్ప'లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తొలి భాగం క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది.

ఇవీ చూడండి: 'భీమ్లా నాయక్'​ ట్రీట్​.. 'కార్తికేయ 2' హీరోయిన్ ఖరారు

ABOUT THE AUTHOR

...view details