స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పనిచేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దానిని చూసి అభిమానులు అప్పుడే కథ ఊహించేసుకుంటున్నారు. అయితే వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటనను స్ఫూరిగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు సమాచారం.
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన ఆధారంగా బన్నీ సినిమా! - అల్లు అర్జున్ తాజా వార్తలు
ఇటీవలే జరిగిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన ఆధారంగా కొరటాల తన తదుపరి సినిమా తీయనున్నారట. ఇందులో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
అల్లు అర్జున్-కొరటాల శివ
ఈ సినిమాలో బన్నీ విద్యార్థి నాయకుడిగా, రీసెర్చర్‌గా కనిపించనున్నారట. భారీ పరిశ్రమల వల్ల ప్రకృతి ఎలా నశించిపోతోంది? స్వచ్ఛమైన పల్లెలు ఎలా అంతరించిపోతున్నాయి? అనే అంశాలు ఇందులో చర్చింబోతున్నారట. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడం పూర్తయిన వెంటనే ప్రీప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని సమాచారం.
ప్రస్తుతం చిరుతో 'ఆచార్య' తీస్తున్న కొరటాల.. ఆది ముగిసిన వెంటనే అల్లు అర్జున్ సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. అప్పుడే పూర్తివివరాలు వెల్లడించనున్నారు.