అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అయితే త్వరలో ఈ చిత్రం నుంచి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట చిత్రబృందం. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట.
బన్నీ బర్త్‌డేకు అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధం! - Allu Arjun Birthday
సుకుమార్ దర్శత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈనెలలో బన్నీ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు చిత్రబృందం ఓ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఇటీవలే ఓ అభిమాని డిజైన్ చేసిన పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చాలా మంది అదే ఫస్ట్‌లుక్ అనుకున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. "ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్. మేము అధికారికంగా ప్రకటించే వరకు దాన్ని చూస్తూ ఉండండి" అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో బన్నీ బర్త్‌డేకి ఫస్ట్‌లుక్ విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'శేషాచలం' అనే పేరు పరిశీలనలో ఉంది. చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్నీ ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడని ఇటీవలే వార్తలొచ్చాయి.