తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Allu Arjun: ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు! - శాకుంతలం షూటింగ్​లో పుష్పరాజ్​

మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'శాకుంతలం'(Shaakuntalam). కథానాయకుడు అల్లుఅర్జున్(Allu Arjun)​ కుమార్తె అర్హ ఇందులో భరతుడిగా కనిపించనుంది. ప్రస్తుతం తను ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంది. అదే లొకేషన్‌లో అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అలా సెట్‌లో అర్హను(Allu Arha) కలిసిన అర్జున్‌ తన మనసులో మాటను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

Allu Arjun emotional tweet about his daughter Arha
Allu Arjun: ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు!

By

Published : Aug 9, 2021, 7:37 PM IST

"నటీనటులుగా మేం సెట్‌లో కలుసుకునేందుకు మరో 15-20 ఏళ్లు పడుతుందనుకున్నాను. కానీ ఈరోజే ఆ పరిస్థితి ఎదురైంది" అని తన ముద్దుల కూతురు అర్హని ఉద్దేశించి ట్వీట్‌ చేస్తూ తండ్రిగా ఉప్పొంగిపోయారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun). 'శాకుంతలం'(Shaakuntalam) చిత్రంతో అర్హ వెండి తెరకు పరిచయమవుతోంది. సమంత(Samantha Akkineni) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌(Gunasekhar) తెరకెక్కిస్తున్న చిత్రమిది.

"ఈరోజు నేను, నా కూతురు అర్హ ఒకే లొకేషన్లో రెండు వేర్వేరు చిత్రాల షూటింగ్​లో పాల్గొన్నాం. అందుకని ఆమె షూటింగ్​ సెట్​కు వెళ్లాను. అయితే నటీనటులుగా మేం సెట్​లో కలుసుకునేందుకు మరో 15-20 ఏళ్లు పడుతుందని అనుకున్నాను. కానీ, అది ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. పుష్ప మీట్స్‌ భరత ఇన్‌ శాకుంతలం. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది".

- అల్లుఅర్జున్​, కథానాయకుడు

'పుష్ప', 'శాకుంతలం' చిత్రాలూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. అల్లు అర్జున్​ హీరోగా నటిస్తున్న 'పుష్ప' ఈ క్రిస్మస్‌కు విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం ఆగస్టు 13న విడుదలవుతుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. 'శాకుంతలం' చిత్రీకరణ ఇటీవల పునః ప్రారంభమైంది. మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి..మహేష్​- త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్​ వచ్చేసింది..

ABOUT THE AUTHOR

...view details