తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారికి విరాళమిచ్చిన హీరో అల్లు అర్జున్ - tollywood news

మరోసారి దాతృత్వం చాటుకున్నాడు హీరో అల్లు అర్జున్. జర్నలిస్టు అసోసియేషన్​కు రూ.10 లక్షల విరాళమిచ్చాడు.

వారికి విరాళమిచ్చిన హీరో అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్

By

Published : Feb 5, 2020, 7:49 PM IST

Updated : Feb 29, 2020, 7:33 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఫిల్మ్ న్యూస్​కాస్టర్స్ అసోసియేషన్​ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా(ఎఫ్​ఎన్​ఏఈఎమ్)కు రూ.10 లక్షల రూపాయలు విరాళమిచ్చాడు. ఆ ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నారు.

జర్నలిస్టు అసోసియేషన్​కు రూ.10 లక్షల విరాళమిచ్చిన అల్లు అర్జున్

ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. ప్రేక్షకాదరణ పొంది, అన్నిచోట్ల అలరిస్తోందీ చిత్రం. చాలాచోట్ల నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో పూజా గ్లామర్, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్​లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని డైరెక్టర్లను అందరినీ పిలిచి, ఇటీవలే పార్టీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

టాలీవుడ్ దర్శకులతో హీరో అల్లు అర్జున్
Last Updated : Feb 29, 2020, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details