తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Allu Arjun Daughter: అర్హ చేసిన పనికి బన్నీ ఫిదా - AAFamily

Allu Arjun Daughter: హాలీడే ముగించుకుని శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​కు తన కూతురు స్వీట్​ సర్​ప్రైజ్​ ఇచ్చారు. తండ్రి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న అర్హ.. ఆయన్ని సర్‌ప్రైజ్‌ చేస్తూ స్పెషల్‌గా వెల్‌కమ్‌ చెప్పారు.

Allu Arjun
అల్లు అర్జున్

By

Published : Jan 29, 2022, 3:34 PM IST

Allu Arjun Daughter: 'పుష్ప'తో ఇటీవల మరో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన 'పుష్ప' సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తదుపరి సినిమాల షూటింగ్స్‌ ప్రారంభించడానికి ముందు వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుని టూర్‌ కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో భాగంగా దుబాయ్‌లో తీసుకున్న పలు ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అయితే, ఈ టూర్‌ కోసం సుమారు రెండు వారాల నుంచి ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు.

తండ్రికి అర్హ క్యూట్​ వెల్​కమ్

కాగా, హాలీడే ముగించుకుని శనివారం ఉదయం బన్నీ ఇంటికి చేరుకున్నారు. తన తండ్రి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న అర్హ.. ఆయన్ని సర్‌ప్రైజ్‌ చేస్తూ స్పెషల్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. గులాబీలు, కొన్ని రకాల ఆకులతో 'వెల్‌కమ్‌ నాన్న' అని గుమ్మం ఎదుటరాశారు. అది చూసిన బన్నీ ఆనందానికి గురయ్యారు. "16 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అర్హ చెప్పిన స్వీట్‌ వెల్‌కమ్‌ నన్ను సంతోషానికి గురి చేసింది" అని పోస్ట్‌ పెట్టారు.

'పుష్ప'రాజ్​ అడ్డాగా.. బన్నీ ఆఫీస్​

'పుష్ప' స్టైల్​లో అల్లు అర్జున్ కార్యాలయం

అంతేకాకుండా, 'పుష్ప' సక్సెసైన సందర్భంగా 'AAFamily' స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసింది. అల్లు అర్జున్​ ఆఫీస్​ను పుష్ప థీమ్​లో అలకంరించారు. ఆ ఫొటోలను బన్నీ షేర్‌ చేస్తూ 'AAFamily'కి థ్యాంక్స్‌ చెప్పారు.

'పుష్ప' థీమ్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:హృతిక్ రోషన్​తో ఉన్న ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు?

ABOUT THE AUTHOR

...view details