Allu arjun insta follwers: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ఇన్‌స్టాలో మరో మైలురాయిని చేరుకున్నారు. 15 మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను చేరుకున్నారు. ఈ మార్క్‌ను అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
ఇటీవల 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. దక్షిణాదితో పాటు ఉత్తరాది ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నారు. శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్.. వన్‌మ్యాన్ షో చేశారు.