అల్లు అర్జున్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్, సీనియర్ హీరోయిన్ టబు, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారట.