తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీకి బర్త్​డే విషెష్ చెప్పిన సినీ ప్రముఖులు - తమన్

సినీ వారసుడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్. మేనమామ మెగాస్టార్​లా అదిరే స్టెప్పులేసి మెప్పించాడు. తొలి సినిమా 'గంగోత్రి' నుంచి ఇటీవల విడుదలైన 'అల వైకుంఠపురములో' వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నేడు స్టైలిష్​ స్టార్​ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun Birthday Wishes
స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ

By

Published : Apr 8, 2020, 2:57 PM IST

స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్.. డ్యాన్స్​లోనూ, నటనలోనూ తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నాడు. ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంటూ అలరిస్తున్నాడు బన్నీ. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

1. అల్లు శిరీష్​

బన్నీ సోదరుడు అల్లు శిరీష్​ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. అన్నయ్యే తన స్ఫూర్తి అని కొనియాడాడు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ బన్నీ.. శిరీష్​ల చిన్ననాటి ఫొటోను జోడించాడు.

2. దర్శకుడు మారుతి

మంచి ఫ్రెండ్​ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని నాకు ఇచ్చిన మా స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​కు ఇవే నా కృతజ్ఞతలని తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు మారుతి.

3. సురేందర్ రెడ్డి, దర్శకుడు

దర్శకుడు సురేందర్ రెడ్డి.. బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ దర్శకుడు బన్నీకి రేసుగుర్రం వంటి మంచి హిట్​ ఇచ్చాడు. అల్లుఅర్జున్ కొత్త సినిమా 'పుష్ప 'లోని లుక్​ను పోస్ట్​ చేశాడు.

4. రామ్​ చరణ్​

బన్నీకి రామ్​ చరణ్​ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్ననాటి ఫొటోలను పంచుకున్నాడు.

5. తమన్​

మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​ బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

6. దేవీ శ్రీ ప్రసాద్​

మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్..​ అల్లు అర్జున్​కు ట్విట్టర్​ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

7. వీవీ వినాయక్

మాస్ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్ బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ కొత్త సినిమా 'పుష్ప 'లుక్​ను పోస్ట్​ చేశాడు.

8. బాబీ

'పుష్ప' సినిమా ఫస్ట్ లుక్​ను పోస్ట్ చేస్తూ బాబీ.. బన్నీకి బర్త్​డే విషెష్ చెప్పాడు.

అలాగే పూరి జగన్నాథ్, రానా, నవదీప్, శ్రీరామ్ ఆదిత్య, మెహర్ రమేష్, వెంకీ కుడుముల తదితరులు బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

ఇదీ చదవండి:బన్నీ కసి, కృషిని మెచ్చుకున్న మెగాస్టార్

ABOUT THE AUTHOR

...view details