ప్రముఖ నటుడు అల్లు అర్జున్(allu arjun) రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో తినడం ఎప్పుడైనా చూశారా? అయినా ఆయన అలాంటి హోటల్‌కు ఎందుకెళ్తారనే కదా మీ సందేహం. దీనికి తగిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్, గోకవరంలోని ఓ కాకా హోటల్‌లో అల్పాహారం తీసుకుని, హోటల్ యజమానికి డబ్బులిస్తున్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన నెటిజన్లు 'అల్లు అర్జున్ సింప్లిసిటీకి మారుపేరు' అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ వీడియోలో అర్జున్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'(pushpa movie release date) కాకినాడ పోర్టులో చిత్రీకరణ జరుగుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్ ఇలా సరదాగా బయటికి వచ్చి, ఆ హోటల్‌కు వెళ్లారని తెలుస్తోంది.