తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లారీ డ్రైవర్​ పాత్రలో అల్లు అర్జున్? - allu arjun as lorry driver in AA20

సుకుమార్​ దర్శకత్వంలో రూపొందే కొత్త చిత్రంలో స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్​ పాత్రలో బన్నీ కనిపించనున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అల్లు అర్జున్

By

Published : Nov 20, 2019, 2:28 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' నటిస్తూ బిజీగా ఉన్నాడు. తర్వాతి సినిమా సుకుమార్​ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. చిత్తూరు అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. బన్నీ పాత్రకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది.

#ఏఏ20 వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్​ చేసే లారీ డ్రైవర్​గా, ఓ వినూత్న పాత్రలో బన్నీ కనిపించనున్నాడట. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

దర్శకుడు సుకుమార్​తో హీరో అల్లు అర్జున్

హీరోయిన్ రష్మిక మందణ్న.. ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. ప్రతినాయక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: సంక్రాంతి పోరు.. బన్నీ జోరుగా.. మహేశ్​ మెల్లగా..

ABOUT THE AUTHOR

...view details