తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యతో 'పుష్ప'రాజ్​.. 'ఆహా'లో తగ్గేదేలే! - ఆహా

Unstoppable with NBK: 'అఖండ'తో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. మళ్లీ తన తన తొలి టాక్​ షో 'అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బీకే'తో బిజీ అయ్యారు. ఇటీవలే ఈ కార్యక్రమానికి రాజమౌళి, రవితేజ విచ్చేయగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశారు.

Unstoppable with NBK
Allu Arjun

By

Published : Dec 21, 2021, 2:38 PM IST

Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణతో సందడి చేయనున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. 'ఆహా' ఓటీటీలో బాలయ్య హోస్ట్​ చేస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' షోకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దీంతో బాలయ్యతో కలిసి పుష్పరాజ్​ ఎలాంటి అల్లరి చేశారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్​ 25న ప్రసారంకానుంది.

అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బీకే'లో అల్లు అర్జున్

ఇటీవలే 'అఖండ'తో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచిన చిత్రమది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన.. మళ్లీ తన తొలి టాక్​ షో అన్​స్టాపబుల్​తో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే రవితేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపిన అన్​స్టాపబుల్​ బృందం.. మంగళవారం బన్నీ హాజరైనట్లు వెల్లడించింది.

ఇక 'పుష్ప'తో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల మందుకు వచ్చి పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతోంది. బన్నీ నటనకు అభిమానులు సహా ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details